ఎమ్మెల్సీ కవితకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ఆహ్వానం
హైదరాబాద్ (CLiC2NEWS): లండన్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. ఈ నెల 30 వ తెదీన లండన్‌లో నిర్వహించనున్న `డెవలప్‌మెంట్ ఎకనామిక్స్` అనే అశంపై ప్రసంగించేందుకు ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఈ కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థులకు ఎమ్మెల్సీ వివరించనున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరెంటు, రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి తదితర అంశాలపై ఎమ్మెల్సీ కవిత ప్రసంగించనున్నారు.