Oxygen అందక 11 మంది కరోనా రోగులు మృతి

చెన్నై(CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఒక వైపు కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మరో వైపు ఆక్సిజన్ కొరతో మరిన్ని మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్టులోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అయితే ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడ లోపం జరిగిందో తెలియాల్సి ఉంది.
అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బాధితులు మృతి చెందినట్లు వారి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని పలురాష్ట్రాల్లో రోజురోజుకు ఆక్సిజన్ అందక మృతి చెందే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.