చిరంజీవి, వెంకయ్యకు పద్మవిభూషణ్ పురస్కారాలు

ఢిల్లీ (CLiC2NEWS): మాజి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ హీరో చిరంజీవిలకు పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. ఈ మార్చి – ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. వీరిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు.
సేవా రంగంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని వరించింది. సినీ రంగంలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దర్కిన తెలుగు నటుడు చిరంజీవి. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి, సేవా గుణమే ఈ గౌరవానికి కారమైంది.