కార్మికుల‌కు రేపు వేత‌నంతో కూడిన సెల‌వు: రాష్ట్ర ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ (CLiC2NEWS): సోమ‌వారం సార్వ‌త్రిక‌ల ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా కార్మికుల‌కు వేత‌నంతో కూడిన సెల‌వు ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ‌లోని 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు రేపు పోలింగ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. పోలింగ్ సిబ్బంది, ఉద్యోగుల‌కు మంగ‌ళ‌వారం ఆన్ డ్యూటిగా ప‌రిగ‌ణించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఈనెల 14వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు మూసి వేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. సోమ‌వారం ఉద‌యం 7 గంటల నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగుతుంది.

Leave A Reply

Your email address will not be published.