300 నుండి 400 డ్రోన్లతో పాక్ దాడులు..

Operation Sindoor: నాలుగు రాష్ట్రాల్లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 300 నుండి 400 డ్రోన్లతో పాకిస్థాన్ దాడులకు పాల్పడి నట్లు భారత సైన్యం వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన విదేవాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గురువారం రాత్రి పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని.. నియంత్రణ రేఖ వెంట ఉల్లంఘనకు పాల్పడుతూ దాడులతూ తెగబడింది. పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది.
భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా పాక్ దాడులు నిర్వహించింది. తుర్కియోకు చెందిన ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లను వినియోగించినట్లు ప్రాథమిక నివేదికల ప్రకారం తెలిసినట్లు సమాచారం. పాకిస్థాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లను కూల్చేసినట్లు తెలిపారు. పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. డ్రోన్, క్షిపణి దాడులు జరుపుతున్నప్పటికీ .. పాక్ అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదు. కరాచి, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. పాక్ దాడులకు భారత్ నుండి ప్రతిస్పందన ఉంటుందని తెలిసీ కూడా.. పౌర విమానాలను పాకిస్థౄన్ రక్షణ కవచంగా వాడుకుంటోంది. ఇది భారత్-పాక్ మధ్య
అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతోపాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించిందని రక్షణశాఖ ప్రతినిధులు వెల్లడించారు.