సిహెచ్‌జి సమావేశానికి ప్రధాని మోడీని ఆహ్వానించిన పాక్

ఢిల్లీ (CLiC2NEWS): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సిహెచ్‌జి సమావేశానికి ఇస్లామాబాద్‌కు పాకిస్థాన్ ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించబోయే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సమావేశం ఇస్లామాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశానికి మోడీని ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశానికి మోడీతో సహా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ)కు చెందిన ఇతర నేతలను ఆహ్వానించింది.
గత ఏడాది ఎస్‌సిఒ సమావేశం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్ నగరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ , చైనా అధ్యక్షుడు షిజిన్‌పింగ్ సహా అగ్ర నేతలంతా హాజరయ్యారు. రష్యా, చైనా నేతృత్వంలోని సిహెచ్‌జిలో భారత్, పాక్ సభ్యులుగా ఉన్నాయి. ఇది ప్రాంతాయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది.