అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని పాక్ దాడులు.. భారత ఆర్మి
ఢిల్లీ (CLiC2NEWS): పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ భారత్‌పైకి క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ దాడులకు పాల్పడుతుందని భారత ఆర్మీ ముందుగానే పసిగట్టింది. మిలిటరీ టార్గెట్లతో పాటు పౌరులకు చెందిన సదుపాయాలు, మతపరమైన ప్రాంతాలపై రెచ్చగొట్టే చర్యలు చేయవచ్చనే అంచానా వేసింది. పంజాబ్‌లోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించారు. ముందుగానే ఊహించడంతో దానికి అదనపు రక్షణ కల్పించారు. మన స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా పాక్ డ్రోన్లను, క్షిపణులను మన సైన్యం కూల్చి వేశారని మేజర్ జనరల్ తెలిపారు.