ప్రపంచకప్‌లలో భారత్‌పై పాక్ తొలి గెలుపు

దుబాయ్ (CLiC2NEWS): విశ్వవేదికపై టీమ్ఇండియాను ఓడించాలనుకున్న పాకిస్థాన్ చిరకాల స్వప్నం ఇన్నేండ్లకు నెరవేరింది. వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో కలిపి ఇప్పటి వరకు భారత్ చేతిలో 12 సార్లు ఓడిన పాక్ పదమూడో ప్రయత్నంలో ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది.
టీమిండియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పాక్ ఓపెనర్లిద్దరే టార్గెట్‌ను చేధించడం విశేషం. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్ అజమ్(68 పరుగులు, 52 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్‌లు ( 79 పరుగులు, 55 బంతులు; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదేశారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ సెంచరీతో రాణించగా.. రిషబ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.
పాకిస్తాన్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్లోనే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 8 బంతులు ఆడి 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. షాహిన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్ మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టి ఊపుమీద ఉన్నట్లు కనిపించినా 11 పరుగులకే ఔటయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి హసన్ అలీ బౌలింగ్‌లో కాటన్ బౌల్డ్ అయ్యాడు.
ఆదుకున్న సారథి
వరుసగా 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను కోహ్లీ, రిషబ్ పంత్ ముందుకు నడిపించారు. రిషబ్ పంత్ 30 బంతుల్లో 39 (2 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేశాడు. షాదబ్ ఖాన్ వేసిన 12వ ఓవర్ రెండో బంతికి షార్ట్‌కు ప్రయత్నించిన పంత్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రవీంద్ర జాడేజా 12 బంతుల్లో 13 పరుగులు చేసి నిరాశపరిచాడు. హార్దిక్ పాండ్యా ఏడు బంతుల్లో 11 పరుగులు చేసి పెవివియన్ చేరాడు. చివర్లో భువనేశ్వర్ 5 పరుగులు చేయగా షమీకి స్ట్రైకింగ్ రాలేదు.
పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3, హసన్ అలీ 2, షాదబ్ ఖాన్1 వికెట్, రౌఫ్ 1 వికెట్ తీశారు.
భారత్: రాహుల్ (బి) షాహీన్ షా 3, రోహిత్ (ఎల్బీ) షాహీన్ షా 0, కోహ్లీ (సి) రిజ్వాన్ (బి) షాహీన్ షా 57, సూర్యకుమార్ (సి) రిజ్వాన్ (బి) హసన్ అలీ 11, పంత్ (సి అండ్ బి) షాదాబ్ 39, జడేజా (సి) (సబ్) నవాజ్ (బి) హసన్ అలీ 13, హార్దిక్ (సి) బాబర్ (బి) రౌఫ్ 11, భువనేశ్వర్ (నాటౌట్) 5, షమీ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 151/7. వికెట్ల పతనం: 1-1, 2-6, 3-31, 4-84, 5-125, 6-133, 7-146, బౌలింగ్: షాహీన్ షా 4-0-31-3, వసీమ్ 2-0-10-0, హసన్ 4-0-44-2, షాదాబ్ 4-0-22-1, హఫీజ్ 2-0-12-0, రౌఫ్ 4-0-25-1.
పాకిస్థాన్: రిజ్వాన్ (నాటౌట్) 78, బాబర్ (నాటౌట్) 68, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 17.5 ఓవర్లలో 152/0. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-25-0, షమీ 3.5-0-42-0, బుమ్రా 3-0-22-0, వరుణ్ 4-0-33-0, జడేజా 4-0-28-0.