టిడిపి ఎపి అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..
అమరావతి (CLiC2NEWS): గాజువాక ఎమ్మెల్యే ఎపి టిడిపి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎపి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు మంత్రిగా అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. విశాఖ పట్నం పార్లమెంట్ పార్టి అధ్యక్షుడిగా సమర్ధవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటనలో తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటివరకు పార్టిని ఇప్పటి వరకు నడిపించడంలో అద్భుత పనితీరు కనబర్చిన సీనియర్ నేత, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి అభినందనలు తెలియజేశారు.
ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గాజువాక నుండి పోటీ చేశారు. వైఎస్ ఆర్ పార్టి అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్లు తేడాతో ఆయన గెలుపొందారు. ఎపి పునర్విభజన అనంతరం టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి మూడోసారి కూడా ఉత్తరాంధ్ర నేతలకే దక్కడం విశేషం. ముందుగా కళా వెంకట్రావు.. గత ఐదేళ్ల నుండి అచ్చెన్నాయుడు ఆ పదవిలో కొనసాగుతున్నారు.