పేప‌ర్ లీకేజి కేసు.. మ‌రో ముగ్గురు అరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): టిఎస్‌పిఎస్‌సి ప్ర‌శ్నాప‌త్రం లీకేజి కేసులో మ‌రో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అరెస్ట‌యిన ముగ్గురికి నాంప‌ల్లి కోర్టు గురువారం 14 రోజుల‌ రిమాండ్ విధించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 127 మార్కులు సాధించిన ష‌మీమ్ 2013లో గ్రూప్‌-2 ఉద్యోగం పొందాడు. ష‌మీమ్ రాజ‌శేఖ‌ర్ నుండి గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పేప‌ర్ తీసుకున్న‌ట్లు తెలిపాడు. అంతేకాకుండా టిఎస్‌పిఎస్‌పిలో పొరుగు సేవ‌ల ఉద్యోగిగా ప‌నిచేస్తున్న ర‌మేశ్‌కు ప్రిలిమ్స్‌లో 122 మార్కులు సాధించాడు. ఈ పేప‌ర్‌కోసం డ‌బ్బులు ఏమీ వ‌సూలు చేయ‌లేద‌ని ష‌మీమ్ తెలిపాడు. అత‌ను ఇచ్చిన ఆధారాల మేర‌కు ర‌మేశ్‌, సురేశ్, ష‌మీమ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిని చంచ‌ల‌గూడ జైలుకు త‌ర‌లించారు.

ప్ర‌శ్నాప‌త్రం లీకేజి కేసు: మ‌రికొన్ని ప్ర‌శ్నాప‌త్రాలు స్వాధీనం..

Leave A Reply

Your email address will not be published.