మరో భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై వేటు
Paris Olympics: మరో భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్ నిషేధానికి గురయ్యారు. ఒలింపిక్ నిర్వాహకులు అధిక బరువు కారణంతో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై బుధవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు గాను భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై మూడోళ్ల నిషేధం విధించింది. అంతిమ్ అక్రిడిటేషన్ దుర్వినియోగం చేసిందని భావించిన ఒలింపిక్ అసోసియోషన్ రద్దు చేసింది. అంతిమ్ సంఘాల్ తన సోదరిని ఒలింపిక్ గేమ్స్ విలేజ్‌లోకి తన అక్రిడిటేషన్‌తో పంపించడమే కారణమైంది. తన వస్తువులు క్రీగా గ్రామంలో ఉన్నాయని సోదరి నిశాను తీసుకురమ్మని కోరింది. అందుకు తన అక్రిడిటేషన్ కార్డును ఇచ్చింది. నిశా క్రీడా గ్రామంలోకి వెల్లి వస్తువులను తీసుకొస్తుండగా.. సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. ఆమెనుంచి స్టేట్‌మెంట్ తీసుకుని పంపించారు. అంతిమ్‌ను కూడా పిలిపించి వివరణ నమోదు చేశారు. అనంతరం ఒలింపిక్ నిర్వాహకులు అక్రిడిటేషన్ దుర్వినియోగం అయిందని భావించి దానిని రద్దు చేశారు.