పారిస్ ఒలిపింక్స్: భారత్ షూటర్ స్వప్నిల్‌కు కాంస్యం
Paris Olympics: పారిస్ ఒలిపింక్స్‌లో భారత్‌కు మరో పతకం అందుకుంది. యువ షూటర్ స్వప్నిల్ .. మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ లో 451.4 పాయింట్లు సాధించి, కాంస్య పతకం అందుకున్నాడు. చైనాకు చెందిన లియుకున్ 463.6) స్వర్ణం, ఉక్రెయిన్ షూటర్ కులిష్ సెర్హియ్ (461.3) రజతం సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీ రైఫిల్ 3 పొజిషన్స్ అర్హత పోటీలో తొలి ఎనిమి స్థానాల్లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించగా.. స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు పారిస్ ఒలింపింక్స్‌లో మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించింది. ముందుగా మహిళల 10 మీ ఎయిర్ పిస్టల్లో కాంస్యం అందుకుంది. అనంతరం సరబ్ జ్యోత్‌లో కలిసి మిక్స్‌డ్ 10 మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మరో పతకం దక్కించుకుంది.