ప్రజలు ఒక్కోసారి బయటపడకుండా నిశ్శబ్ద విప్లవం చేస్తారు.. పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజం సాధించినందుకు ప్రముఖ సిని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా కూటమి సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజలు ఒక్కోసారి బయటపడకుండా నిశ్శబ్దంగా విప్లవం చేస్తారని.. ఎపి ఎన్నకల్లో అదే జరిగిందన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా రాజకీయ నాయకులు ఉండకపోతో నిశ్శబ్ద విప్లవాలు జరుగుతాయని నిరూపించారన్నారు. చంద్రబాబు గవర్నమెంట్‌లో తాను పనిచేశానని.. పోరాట శక్తికి వయసుతో సంబంధం లేదని నిరూపించారన్నారు. ఆయన అరెస్ట్ చాలా బాధాకరమని.. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డానన్నారు. దాన్ని కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు.
పవన్‌కల్యాణ్‌తో పనిచేయలేదని, పవన్‌తో అక్కసారే కలిశానన్నారు. పవన్‌కు బిడియం ఎక్కవని, కానీ ఎన్నికల్లో భావోద్వేగంతో, విశ్వాసంతో పనిచేశాడన్నారు. ఏ క్షణం ఆయన కళ్లలోకి చూసినా నేను సాధిస్తున్నా అనే విశ్వాసం కనిపిందచేదన్నారు. పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌ని చూస్తున్నపుడు వాళ్ల అరుపులు వింటే కంఠ నరాలు తెగిపోతాయోమోననిపిస్తుందని.. అంత గొప్ప ఫ్యాన్స్ ఆయన సొంతమన్నారు. గెలిచిన తర్వాత కూడా పవన్ ఎంతో వినయంతో ఉన్నారని.. ప్రజలకు ఇచ్చిన మాటలను ఎలా నెరవేర్చాలనే ఆలోచనతోనే మాట్లాడారని.. ఎవరినీ నిందించలేదన్నారు. ఆలా మాట్లాడటం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని పవన్‌పై ప్రశంసలు కురిపించారు.