భీమవరం వదులుకోలేను, నాదే .. జనసేనాని

మంగళగిరి (CLiC2NEWS): భీమవరం మాజి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. రామాంజనేయులు చేరిక జనసేనకు చాలా కీలకమని, ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తిని కూడా ముందుకు తీసుకెళ్లుడంలో కీలకంగా మారారన్నారు. కుబేరులు ఉండే భీమవరం ఒక రౌడీ చేతిలో బందీ అయిందని .. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం, వర్గంపై పడుతుందని.. యుద్ధం తాలూకూ అంతిమ లక్ష్యం.. ప్రభుత్వాన్ని మార్చేలా చేయడం అని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాల్లో యుద్దమే ఉంటుందని, బంధుత్వాలు ఉండవని అన్నారు. దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పే అవుతుందని అన్నారు. పార్టీ పెట్టడానికి సొంత అన్ననే కాదని బయకు వచ్చానని.. భీమవరం వదులుకోనని, ఇక్కడి నుండి రౌడీయిజం పోవాలని పవన్‌కల్యాణ్ అన్నారు.