ఇప్పటంలో పవన్‌కల్యాణ్ పర్యటన..
గుంతలు పూడ్చలేరు, రోడ్డు వేయలేరు కానీ..

మంగళగిరి (CLiC2NEWS): ఇప్పటం గ్రామంలో దాదాపు 53 ఇళ్లు, ప్రహరీ గోడలను ప్రభుత్వం కూల్చివేసింది. ఈ నివాసాలు టిడిపి, జనసేన సానుభూతిపరులకు చెందినవి కావడంతో ప్రభుత్వం కూల్చివేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో జనసేన అధినేత ఇప్పటం బాధితులను పరామర్శించేందుకు ఇప్పటం గ్రామానికి బయలు దేరారు. పోలీసులు పవన్‌కల్యాణ్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన కారు దిగి కొంత దూరం నడిచివెళ్లారు. తర్వాత తన వాహనంలో ఇప్పటం చేరుకున్నారు.
బాధితులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇప్పటం చిన్నగ్రామం.. ఇదేమన్నా కాకినాడ లేకపోతే రామమహేంద్రవరమా రోడ్లు వెడల్పు చేయడానికి .. బాధితులతో మాట్లాడకుండా ఆపడమేంటి.. జనసేన పార్టీ సభకు ఈ గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్రతో వారిని ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. గుంతలు పూడ్చలేరు, రోడ్డు వేయలేరు కానీ.. విస్తరణ కావాలా అని ప్రశ్నించారు.
ఇప్పటంలో ఇళ్లు కూల్చేస్తున్నారు. రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు. ప్రజలపై దౌర్జన్నమం చేస్తున్నారన్నారు. ఎంత కాలం ఈ ఆన్యాయం చూస్తూ ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా పూర్తి బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డిదేనని పవన్ అన్నారు.