నూకాంబికా అమ్మ‌వారికి మొక్కులు చెల్లించిన జ‌న‌సేనాని

అన‌కాప‌ల్లి (CLiC2NEWS): జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ సోమ‌వారం అన‌కాప‌ల్లిలోని నూకాంబికా అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి , మొక్కులు చెల్లించుకున్నారు. అన‌కాప‌ల్లి లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ .. పిఠాపురంలో తాను గెలిచి కూట‌మి అధికారంలోకి వ‌స్తే అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో అమ్మ‌వారి ఆల‌యానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆల‌య అధికారులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. పూజ‌లు అనంత‌రం వేదాశీర్వాదం చేసి, తీర్థ ప్ర‌సాదాలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.