నాలాంటి కోట్లమంది కలల ప్రతి రూపమే మోడీ: పవన్‌కల్యాణ్
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోడీ ధైర్యం నింపారని జనసేనాని పవన్‌కల్యాణ్ కొనియాడారు. మంగళవారం నగరంలోని ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన బిజెపి బిసి ఆత్మగౌరవ సభలో పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దేశ ప్రయోజనాల కోసం పనిచేశారని.. మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో బిసిల తెలంగాణ రావాలన్నారు. మోడీ ఎన్నికల కోసం పనిచేసి ఉంటే.. ఆర్టిక్ 370, నోట్ల రద్దు చేసేవారు కాదన్నారు. రామ మందిరం నిర్మింయగలిగే వారు కాదన్నారు. మోడీ మరోసారి ప్రధాని కావాలని.. నాలాంటి కోట్లమంది కలల ప్రతి రూపమే నరేంద్ర మోడీ అని పవన్‌కల్యాణ్ అన్నారు.