క‌ష్టాల్లో ఉన్న‌వారంతా నా సొంత‌వాళ్లే.. ప‌వ‌న్‌క‌ల్యాణ్

చింత‌ల‌పూడి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కౌలు రైతుల‌ను ఆదుకునేవారు లేకుండా పోయార‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కౌలు రైతుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం గుర్తించాల‌ని.. వారికి అండ‌గా ఉండాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా చింత‌ల‌పూడిలో నిర్వ‌హించిన జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ..

రాష్ట్రంలో 80 శాతం కౌతు రైతులే ఉన్నార‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 3 వేల‌కుపైగా కౌలు రైతులు ఆత్మ‌హ‌త్యలు చేసుకున్నార‌ని పేర్కొన్నారు. కౌలు రైతులు అధిక వడ్డీల‌కు అప్పులు తీసుకుంటున్నార‌ని, ఆ అప్పులు తీర్చ‌లేక ఆగ్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైతు ఆత్మ‌హ‌త్య‌ల్లో ఎపి 3వ స్థానంలో ఉంద‌ని, కౌలు రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో రెండో స్థానంలో ఉంద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.

కౌలు రైతుల స‌మ‌స్య‌ల‌ను వైఎస్సార్ పార్టీ సృష్టించింద‌ని నేను చెప్ప‌డంలేదు. వారి స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చాన‌ని ప‌వ‌న్ అన్నారు. వైఎస్సార్ పార్టీ అంటే నాకు ద్వేషం లేదు. ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడ‌వ‌క పోతే గ్రామాల్లో ఎందుకు గ్రామ స‌చివాల‌యాల‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడుస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. అలా చేయ‌క‌పోతే మాత్రం గ‌ట్టిగా అడుగుతామ‌ని ప‌వ‌న్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.