యువతే మన పార్టీకి పెద్దబలం.. పవన్‌కల్యాణ్

మంగళగిరి (CLiC2NEWS): మన పార్టీకి యువత బలం చూసి బిజెపి పెద్దలు ఆశ్చర్యపోయారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్‌కాల్యాణ్ మాట్లాడుతూ.. ఎపిలో జనసేన ఆరున్నరల లక్షల క్యాడర్ ఉందని, యువతే పెద్ద బలమని పవన్‌కల్యాణ్ అన్నారు. కార్యకర్తల చిత్తశుద్ధి వలనే జనసేనక ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చిందన్నారు. నన్ను, నా భావజాలాన్ని నమ్మి ఇంత మంది యువత వెంట వస్తున్నారన్నారు. అయితే ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూదన్నారు. వైఎస్ ఆర్‌సిపికి భావజాలం లేదని.. ఎందుకుపని చేస్తున్నారో వారికే తెలియడం లేదన్నారు.
యువత ఆదరణ చూసే తెలంగాణ ఎన్కికల్లో 8 స్థానాల్లో పోటీ చేశామన్నారు. ఖమ్మం , మధిర, కూకట్‌పల్లి, దుబ్బాక ఎక్కడికెళ్లినా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మద్ధతును తెలియజేశారని తెలిపారు. హైదరాబాద్‌లో యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటం బాధ కలిగించిందని పవన్‌కల్యాణ్ తెలిపారు. నా సినిమాలు అపేసినా, నేను బసచేసిన హోటల్‌కు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా.. మన పోరాటం మనమే చేసుకున్నామని, ఏనాడూ సాయం కోసం జాతీయ నాయకుల వద్దకు వెళ్లలేదన్నారు. ఇది మన నేల.. మన పోరాటం. మనం చేసే పని, మన పోరాటమే మనకు గుర్తింపు నిస్తుందని, స్వార్థం వదిలేయాలని పార్టీ శ్రేణులకు పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.