కడ శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటా.. జనసేనాని
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/PAWAN-KALYAN-IN-RANASTALAM.jpg)
రణస్థలం (CLiC2NEWS): శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. కడ శ్వాస ఉన్నంతవరకు రాజకీయాలను వదలనని.. రణస్థలంలో మాట ఇస్తున్నాన్నారు. ఈ దేశంలో పూర్తి రాజకీయ నాయకులు ఎవరున్నార. అందరూ ఏదో ఒక వ్యాపారం, కాంట్రాక్టులో, ఉద్యోగాలో చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినవారే. కిపిల్ సిబల్, చిదంబరం లాంట వారు కూడా లాయర్ వృత్తిలో కొనసాగుతూనే రాజకీయల్లోకి వచ్చారన్నారు. నేనూకూడా రాజకీయల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నానన్నారు. పార్టీని నడిపేంత డబ్బు వస్తే సినిమాలు వదిలేస్తానని స్పష్టం చేశారు.
నామనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించి ఆలోచించింది. నేను తొలి ప్రేమ, ఖుషి సినిమాల వరకే పోరాటం చేశా. సినిమాల విజయం నాకు సంతోషం కలగలేదు. సామాన్యుల కష్టం నన్ను ఆనందంగా ఉండనివ్వలేదన్నారు. నాయకకుల నిజస్వరూపాలు నాకు చిరాకు, బాధను కలిగించాయని.. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి బాధ కలిగిందని పవన్ తెలిపారు. పార్టీ పెట్టినపుడు నాపక్కన ఎవరూ లేరు. ఈ రోజు ప్రతి సన్నాసితో తిట్లు పడుతున్నా బాధ కలగట్లేదన్నారు. సాటి మనుషుల కోసం జీవించడం గొప్ప విషయంగా భావిస్తున్నా అని అన్నారు. నేను గెలుస్తానో.. ఓడుతానో తెలియదు.. కానీ, పోరాటమే తెలుసు. గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసన్నారు. ప్రజల తరపున పోరాడే సత్తా నాకు గత ఎన్నికల్లో ఇవ్వలేదని.. మీరు నమ్మితే మీ ససమస్యలు తీరుస్తానన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపుతా.. ఇక్కడ అభివృద్ధి అవకాశాలు ఎన్నోఉన్నాయన్నారు. కానీ, ఇక్కడున్న సమస్యలు గురించి మాట్లాడే వారే లేరు. మీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని.. సరైన రాజు లేక పోతే రాజ్యం నాశనం అవుతుందని జనసేనాని తెలిపారు.