నా పరాజయాల గురించి నిర్భయంగా మాట్లాడుతా.. జనసేనాని
![](https://clic2news.com/wp-content/uploads/2021/04/pavan-750x313.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని శిల్పకళా వేదికలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి.. ఫేసింగ్ ది ప్యూచర్ అంశంపై సిఎ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నా పరాజయాల గురించి నిర్భయంగా మాట్లాడతానని, పరాజయంలోనే జయం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను పరాజయం పొందిన రాజకీయ నాయకుడినని, ఓడిపోయానని చెప్పుకోవడానికి ఏ మాత్రం సంశయించడం లేదని అన్నారు. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దనీ.. దేవుడినైనా సరే గుడ్డిగా నమ్మొద్దన్నారు. ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది మనమే నిర్ణయించుకోవాలన్నారు. మన వ్యక్తిగత విజయం దేశానికి పెట్టుబడి అని జనసేనాని అన్నారు.