ఎపి మంత్రిగా ప్రమాణం చేసిన పవన్ కల్యాణ్

విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. బుధవారం విజయవాడ సమీపంలో జరిగిన భారీ సభలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడు, మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా అతిరథ మహారథులు హాజరయ్యారు.