త‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పై స్పందించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి మంత్రివ‌ర్గంలో త‌న‌కు కీల‌క శాఖ‌లు కేటాయించినందుకు సిఎం చంద్ర‌బాబుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆ శాఖ‌లు జ‌న‌సేన సిద్ధాంతాల‌కు, త‌న మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌ని.. మంత్రిగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సేవ చేసే భాగ్యం ద‌క్కింద‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. త‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పై పూర్తిగా అధ్య‌యనం చేసి ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెర‌గైన సేవ‌లు అందించేందుకు కృషి చేస్తాన‌ని డిప్యూటి సిఎం ప‌వ‌న్‌కల్యాణ్ తెలిపారు.
నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేశ్‌కు ప్ర‌జా ప్ర‌యోజ‌న శాఖ‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు సంతృప్తి వ్య‌క్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోమౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తాన‌ని.. ఉపాధి హామీ నిధుల స‌ద్వినియోగం.. జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ ద్వారా గ్రామాల‌కు తాగునీరు అందించ‌డం.. అట‌వి సంప‌ద‌ను కాపాడి, ప‌చ్చ‌ద‌నాన్ని పెంచుతాన‌ని చెప్పారు. పర్యాట‌క ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవ‌కాశాలు.. సినీ రంగానికి రాష్ట్రంలో స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొ్ల్పుతానన్నారు.

Leave A Reply

Your email address will not be published.