కాంస్య ప‌త‌క విజేత అమ‌న్‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ విషెస్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): భార‌త రెజ్ల‌ర్ అమ‌న్ సెహ్రావ‌త్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కాన్ని సాధింటం ఆనందంగా ఉంద‌ని ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఆమ‌న్‌కు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెల‌య‌జేస్తున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. వినేశ్ ఫొగాట్ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఫైన‌ల్ పోటికి దూర‌మ‌య్యార‌ని.. అమ‌న్ ప‌త‌కం సాధించ‌డంతో భార‌త క్రీడాభిమానులు సంతోషంగా ఉన్న‌ర‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు.

రెజ్లింగ్ యువ అథ్లెట్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య‌ప‌తకాన్ని అందుకుని చ‌రిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో వ్య‌క్తిగ‌త ప‌త‌కం గెలిచిన అతిచిన్న వ‌య‌సు భార‌త అథ్లెట్‌గా అమ‌న్ చ‌రిత్ర సృష్టించాడు. ఓ ద‌శ‌లో అమ‌న్‌పై కూడా వేటు ప‌డుతుందేమోన‌ని భ‌య‌ప‌డ్డ త‌రుణంలో భార‌త్‌కు ప‌త‌కం తీసుకొచ్చాడు. సెమీస్‌లో ఓట‌మికి గురైన అమ‌న్ గురువారం రాత్రి అత‌ని బ‌రువు 61.5 కేజీలు ఉన్నాడు. కానీ కాంస్య ప‌త‌క‌పోరుకు 57 కేజీలు ఉండాలి. దీంతో అత‌ని బ‌రువుపై ప్ర‌త్యేక శ్ర‌ధ్ద పెట్టారు కోచ్‌లు. కేవ‌లం 10 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 4.6 కేజీలు త‌గ్గించారు.

Leave A Reply

Your email address will not be published.