పవన్ కల్యాణ్ తనయుడు అకీరా సంగీత దర్శకుడిగా ఎంట్రీ..!
హైదరాబాద్ (CLiC2NEWS): పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ లఘు చిత్రానికి సంగీతం అందించి.. సంగీత దర్శకుడుగా తొలి అడుగు వేశాడు. రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు అకీరా సంగీతం సమకూర్చనట్లు నటుడు అడవి శేష్ తెలిపారు. తన కెంతో ఇష్టమైన అకీర సినిమాకు సంగీతం అందించాడు అని ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ ఫిల్మ్‌కు అకీరా మ్యాజిక్ డైరెక్టర్ వ్యవహరించాడు. ఒక రచయిత.. కథను రాయడంలో సవాళ్లను ఎలా అధిగమించాడు అనే కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ ఇంగ్లీష్ లఘుచిత్రానికి కార్తికేయ యార్ల గడ్డ దర్శకత్వం వహించారు. దీనిలో మనోజ్ నటించాడు. మ్యూజిక్ అంటే ఎంతో ఆసక్తి ఉన్న అకీరా పియానో ప్లేయర్ అని కూడా తెలిసిన విషయమే. ఆర్ ఆర్ ఆర్ లోని దోస్తీ సాంగ్‌ను పియానోపై ప్లేచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.