మాబిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

హైదరాబాద్ (CLiC2NEWS): సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎపి సిఎం పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే..ఇంకా శంకర్ ఇంకా కోలుకోవాలన్నారు. ఆంజనేయస్వామి దయతో త్వరలో చిన్నారి ఆరోగ్యాంగా ఉంటాడని.. ఓ పెద్ద ప్రమాదం నుండి చిన్నారిని కాపాడి తమకు అండగా నిలిచాడని అన్నారు. చిన్నారి కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.