బాబును పరామర్శించిన పవన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించాడు. హైదరాబాద్‌లో ఇవాళ (శనివారం) సాయంత్రం మనోహర్‌తో కలిసి చంద్రబాబను నివాసానికి వెళ్లారు పవన్. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటలపాటు జరిగిన భేటీలో వివిధఅంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు.
కాగా గత నెల 31వ తేదీన రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే.