ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప‌వ‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రిగా జ‌న‌సేన అధినేత‌, పిఠాపురం ఎమ్మెల్యే ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. విజ‌య‌వాడ‌లోని క్యాంపు కార్యాల‌యంలో బుధ‌వారం ఆయ‌న బాధ్య‌త‌లు చేపట్టారు. డిప్యూటీ సిఎం హోదాలో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. పంచాయ‌తిరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ, శాస్త్ర సాంకేతిక శాఖ‌ల మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంత‌రం ఆయ‌న ప‌లు దస్త్రాల‌పై సంత‌కాలు చేశారు. ఈసంద‌ర్భ‌గా డిప్యూటీ సిఎం ప‌వ‌న్‌కు ప‌లువురు మంత్రులు, జ‌న‌సేన నాయ‌కులు అభినంద‌న‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.