తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్.. ప్రాయశ్చిత దీక్ష విరమణ

తిరుమల (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం పవన్ గత 11 రోజులుగా కొనసాగిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. తిరుమలలోని గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పవన్ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు.