50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకుతున్న పెన్‌గంగ..
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/penganga-river.jpg)
ఆదిలాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగకు వరద ఉధృతి పెరిగింది. జైనథ్ మండలం డొలారా వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పెన్ గంగ ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకుతుంది. వరద ఉధృతి తగ్గేంత వరకు తెలంగాణ- మహారాష్ట్ర మధ్య సరిహద్దులోని 44వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర వెళ్లే వాహనాలు జైనత్ మండలంలోని పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద నిలిపివేయాలని సూచించారు. వరద ఉధృతి తగ్గిన అనంతరం రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులుతెలిపారు. డొలారా వంతెన వద్ద నది ఉధృతిని పోలీసులు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.