పింఛను మూడు నెలలకోసారి కూడా తీసుకోవచ్చు
అమరావతి (CLiC2NEWS): శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రావారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధ్యతగల ప్రజా ప్రతినిధిని .. తప్పు చేసిన వారిని వదిలి పెట్టనన్నారు. రాజకీయ కక్షసాధింపులకు పోనన్నారు. దీపం పథకం కింద ఇచ్చిన సిలిండర్ కు డబ్బు కట్టే పనిలేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, సిలిండర్ కు మీరు కట్టిన డబ్బు 48 గంటల్లో రిఫండ్ అయ్యేలా చూస్తామన్నారు. వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు కలిపి మొత్తం 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నామన్నారు. పింఛను మొత్తాన్ని 3 నెలలకు ఒకసారి కూడా తీసుకోవచ్చాన్నారు. పింఛను ఎవరు ఆపినా నిలదీయండి . అది మా హక్కు.. పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇవ్వాలని ఆదేశించారు.