కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు సహకరించాలి: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రజలు సహకరించాలని ఆ రాష్ట్ర సిఎం కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెండ్‌లైట్ పడగానే వాహనా ఇంజిన్ ఆపివేయాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
నిన్న (మంగళవారం) సిఎం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. కనీసం వారానికి ఒక్కరోజైన సొంత వాహనాలను వాడవకుండా చూసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలు చేపడితే కొంతైనా వాయు కాలుష్యాన్ని నివారించగలమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
It’s not my first time to pay a quick visit this web page, i am browsing this web site dailly and take good information from here
everyday.