హైదరాబాద్‌లో భారీ వర్షం.. ప్రజలు బయటకు రావొద్దు: జిహెచ్ఎంసి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. నల్లకుంట, కాచిగూడ, అంబర్ పేట, గోల్నాక, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట్, మేడ్చల్, లక్డీకాపూల్ ఖైరతాబాద్ హిమాయత్ నగర్, నారాయణగూడ , రామాంతపూర్ బోడుప్పల్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో అవసరమయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని జిహెచ్ ఎంసి మేయర్ విజలక్ష్మి విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.