శ్రీలంకలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజల కష్టాలు!
కిలో బియ్యం రూ. 500, పంచదార రూ. 290
![](https://clic2news.com/wp-content/uploads/2022/03/srilanka.jpg)
శ్రీలంకలో నిత్యావసరం వస్తువుల ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. కిలో చక్కెర రూ. 290, బియ్యం రూ. 500, 400గ్రాముల పాలపొడి రూ. 790గా ఉంది. 12.5 కిలోల వంట గ్యాస్ ధర రూ. 1359పెంచడం వలన రూ. 4119 పలుకుతుంది. లీటర్ పెట్రోల్ ధర 254 రూపాయలు పలుకుతోంది. చైనా నుండి తీసుకున్న భారీ రుణాలు కారణంగా శ్రీలంకలో తీవ్ర పరిణామాలకు కారణమయినట్లు తెలుస్తోంది.
శ్రీలంకలో ఆయిల్, ఆహారం, కాగితం, పప్పులు, ఔషధాలు, వైద్య పరికరాల కోసం పూర్తిగా విదేశాల నుండి దిగుమతులపైన ఆధారపడింది. విద్యాసంస్థల విద్యార్తులకు పరీక్షల నిర్వహణకు అవసరమైన పేపర్, ఇంక్ కూడ అందుబాటులోలేదు.