భగ్గుమన్న పెట్రో ధరలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి, మ‌రో వైపు నిత్యావసర సరుకుల ధరలు.. ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో సామాన్యుడి న‌డ్డి విరుస్తున్నాయి. పెరుగుతున్న చ‌మురు ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడంతో పెట్రోల్, డీజీల్ ధరలు రూ. 100 దాటేశాయి.

తాజాగా లీటర్ పెట్రోల్ పై రూ. 35 పైసలు పెరగగా.. డీజిల్ ధర మాత్రం నిలకడగా ఉంది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.78గా నమోదు కాగా.. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో రూ. 99.86 కు చేరింది. అలాగే.. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.84 గా నమోదు కాగా.. ముంబైలో రూ. 105.92 కు చేరింది.

Leave A Reply

Your email address will not be published.