జూన్ నుండి యుపిఐ ద్వారా పిఎఫ్ విత్‌డ్రా..

ఢిల్లీ (CLiC2NEWS): ఇపిఎఫ్ నుండి నిధుల ఉపసంహరణను సులభతరం చేసే దిశగా కీలక సంస్కరణలు జరుగుతున్నాయి. త్వరలో యుపిఐ నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయంను అందుబాటులోకి తేనున్నారు. ఈ ఏడాది మే లేదా జూన్ నుండి ఉద్యోగులు పిఎఫ్ మొత్తాలను ఎటిఎం, యుపిఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమెదం తెలిపినట్లు ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా వెల్లడించారు. కేవలం నగదు విత్ డ్రా మాత్రమే కాకుండా.. పిఎఫ్‌లో ఎంత మొత్తం ఉందో కూడా యుపిఐ ద్వారా చూసుకోవచ్చని తెలిపారు. ఈ ఆప్షన్ ఒక మైలురాయని.. లక్షలాది మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆటోమెటెడ్ సిస్టమ్ విధానంలో రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చన్నారు. అంతే కాకుండా కోరుకున్న అకౌంట్‌కు ఆ నగదు బదిలీ చేసుకోవచ్చిని పేర్కొన్నారు.