ఎంజిఎం ఆస్పత్రిలో పిజి వైద్య విద్యార్థిని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): జిల్లాలోని ఎంజిఎం ఆస్ప‌త్రిలో పిజి వైద్య విద్యార్థిని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. విధి నిర్వ‌హ‌ణ‌లో త‌న‌కు సీనియ‌ర్ అయిన విద్యార్థి వేధిస్తుండ‌టంతో.. బుధ‌వారం ఆస్ప‌త్రిలో హానిక‌ర‌మైన ఇంజ‌క్ష‌న్ వేసుకొని ప్రీతి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడింది. గ‌మ‌నించిన తోటివారు వెంట‌నే చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్తితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో హైద‌రాబాద్‌లోని నిమ్స్‌కు త‌ర‌లించారు.

ఎంజిఎం క‌ళాశాల‌లో ప్రీతి ఆన‌స్తీషియా విభాగంలో పిజి మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఆమె తండ్రి వ‌రంగ్‌లో ఎఎస్ ఐగా ప‌నిచేస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా త‌న‌ను ఓ సీనియ‌ర్ విద్యార్థి వేధిస్తున్నాడ‌ని కుటుంబ స‌భ్యుల‌కు తెలిపింది. ఈ విష‌యంపై క‌ళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయ‌గా.. సీనియ‌ర్ విద్యార్థిని మంద‌లించిన‌ట్లు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ప్రీతి ఈరోజు ఆత్మ‌హ‌త్యకు ప్ర‌య‌త్నించింది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.