పిన్నెల్లికి 7 ఏళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం: సిఇఒ ముకేశ్‌ కుమార్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎమ్మెల్యే పిన్నెల్లికి 7 ఏళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు సిఇఒ ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. మాచ‌ర్లలో ఇవిఎంలు ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌లోమొత్తం 10 సెక్ష‌న్ల‌తో పిన్నెల్లిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఐపిసి కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పి చ‌ట్టం 131, 135 సెక్ష‌న్్ల‌తో కేసులు న‌మోదు చేశారు. మే 20వ తేదీనే ఎమ్మెల్యేపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఆయ‌న‌ను అరెస్ట్ చేసేందుకు ప్ర‌త్యేక బృందాలు హైద‌రాబాద్‌కు చేరుకున్నాయి. ప‌ల్నాడు జిల్లా ఎస్‌పి ఆధ్వ‌ర్యంలో ఈ బృందాల‌ను ఏర్పాటు చేశారు. ఎపి పోలీసులు, తెలింగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చ‌ర్య‌ల్లో పాల్గొంటున్న‌ట్లు స‌మాచారం. ఎమ్మెల్యే పిన్నెల్లి సంగారెడ్డి వైపు వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. సంగారెడ్డి జిల్లా రుద్రారం వ‌ద్ద కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి ప‌రారైన‌ట్టు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.