ఎపిలో 7 వేల కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక: డిప్యూటి సిఎం
అమరావతి (CLiC2NEW): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 7,213 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్దంచేసినట్లు డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో గురువారం సమీక్ష నిర్హించారు. రోడ్ల నిర్మాణానికి రూ. 4,976 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. 250 జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు అనుసంధానం జరుగుతుందన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ 10% తగ్గించేలా కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు.