పిఎమ్ కిసాన్ నిధులు.. రేపే రైతు ఖాతాల్లో జమ..
ఢిల్లీ (CLiC2NEWS): రైతులకు కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ డబ్బులు రేపు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏడాదికి మూడు దఫాలుగా రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 14 విడతలుగా ఈ నిధులు విడుదల చేసింది. ఇపుడు తాజాగా 15వ విడత నిధులు బుధవారం విడుదల చేయనుంది.
రైతులకు పెట్టుబడి సాయం కింద దాదాపు 8 కోట్ల మందికి రూ. 2వేలు చొప్పున జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం 11.30 గంటలకు ఈ నిధుల విడుదల చేయనున్నారు. అయితే ఈ నిధులు ఎవరైతే ఇ-కెవైసి పూర్తి చేస్తారో వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.