మంత్రులకు శాఖలు కేటాయించిన మోడీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మోడీ జట్టులో కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 15 మంది కేబినెట్ మంత్రులు కాగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
43 మందిలో 36 మంది కొత్తవారు కాగా, ఏడుగురు పదోన్నతి పొందినవారు ఉన్నారు. సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్ రిజిజు, మన్‌సుఖ్ మాండవియా, హరిదీప్‌సింగ్ పురీ, రామచంద్ర ప్రసాద్ సింగ్.. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు ప్రధాని శాఖలను కేటాయించారు. పరిపాలనా అనుభవం, సమర్థతలకు అనుగుణంగా ప్రధాని శాఖలను కట్టబెట్టారు.

మంత్రులు- శాఖలు:
శాఖల వారీగా మంత్రుల వివరాలివి
ప్రధాని నరేంద్రమోడీ:
-సిబ్బంది వ్యవహారాలు, పబ్లిక్ గ్రీవియెన్స్ అండ్ పెన్షన్స్, అణు ఇంధనం, అంతరిక్షం, మంత్రులకు కేటాయించని శాఖలు
కేబినెట్ మంత్రులు.. శాఖలు
- రాజ్‌నాధ్ సింగ్ -రక్షణశాఖ
- అమిత్ షా -హోంతోపాటు సహకార శాఖ
- నితిన్ గడ్కరీ – జాతీయ రహదారులు
- నిర్మలా సీతారామన్ – ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
- నరేంద్ర సింగ్ తోమర్ -వ్యవసాయం, రైతుల సంక్షేమం
- ఎస్ జైశంకర్ -విదేశాంగం
- అర్జున్ ముండా – గిరిజన సంక్షేమం
- స్మ్రుతి ఇరానీ – మహిళా శిశు సంక్షేమం
- పీయూష్ గోయల్ – వాణిజ్య శాఖతోపాటు వివినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ, చేనేత మరియు జౌళి
- ధర్మేంద్ర ప్రధాన్ -విద్యాశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్
- ప్రహ్లాద్ జోషి – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖలు
- నారాయణ్ రాణె -సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
- శర్బానంద సోనోవాల్ -నౌకాయానం, జల మార్గాలు, ఆయుష్ మంత్రిత్వశాఖ
- ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – మైనారిటీ వ్యవహారాలు
- డాక్టర్ వీరేంద్ర కుమార్ – సామాజిక సాధికారత
- గిరిరాజ్ సింగ్ – రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీ రాజ్
- జ్యోతిరాదిత్య సింధియా – పౌర విమానయానం
- ఆర్సీపీ సింగ్ – ఉక్కుశాఖ
- అశ్విని వైష్ణవ్ – రైల్వే, ఐటీ, టెలీ కమ్యూనికేషన్ల శాఖ
- పశుపతి కుమార్ పరాస్ – ఫుడ్ ప్రాసెసింగ్
- గజేంద్ర సింగ్ షెకావత్ -జల శక్తి
- కిరెన్ రిజిజు – న్యాయ శాఖ
- ఆర్‌కే సింగ్ – విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరులశాఖలు
- హర్దీప్ సింగ్ పూరి -పెట్రోలియం, హౌసింగ్, అర్బన్ అఫైర్స్
- మాన్‌సుఖ్ మాండవియా – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఫర్టిలైజర్స్ శాఖలు
- భూపేంద్ర యాదవ్ – పర్యావరణం, అటవీ శాఖ, కార్మిక శాఖ
- డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే -భారీ పరిశ్రమలు
- పురుషోత్తం రూపాలా – పాడి, మత్స్యశాఖలు
- జీ కిషన్ రెడ్డి – సాంస్కృతిక, పర్యాటక శాఖలు, ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధి
- అనురాగ్ సింగ్ ఠాకూర్ – సమాచార, ప్రసారాలు, యువజన క్రీడా సర్వీసులు.