చంద్రయాన్ -3 దిగిన ప్లేస్కు `శివశక్తి` పేరు
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోడీ
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/isro-modi.jpg)
బెంగళూరు (CLiC2NEWS): బ్రిక్స్ సమావేశాలకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాన మంత్రి మోడీ పర్యటన ముగించుకొని నేరుగా బెంగళూరు చేరుకున్నారు. ఇస్రో కేంద్రానికి నేరుగా వెళ్లిన ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు. వారికి సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ` జై విజ్ఞాన్.. జై అనుంసధాన్` అనే నినాదం ఇచ్చారు. చద్రయాన్ 3 విజయం దేశానికి గర్వకారణం అని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. సౌతాఫ్రికాలో ఉన్నా.. తన మనసంతా చంద్రయాన్పైనే ఉందని తెలిపారు. భారత శాస్త్రవేత్తలు అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించారని అన్నారు. ఇప్పటి రకు ఎవరూ చేయలేనిది మన ఇస్రో చేసిందని అన్నారు. చంద్రయాన్ -3 దిగిన ప్రదేశానికి `శివశక్తి` అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు ప్రధాని మోడీ. అలాగే ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.