పంబన్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోడీ..

Pamban Bridge: దేశంలోనే మొట్టమెదటి వర్టికల్ లిప్ట్ రైల్వే సముద్ర వంతెనను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ వంతెన నిర్మాణం జరిగింది. రూ.535 కోట్ల భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతో ఈ వంతెనను నిర్మించారు. ఇది సముద్రంలో 2.08 కిలో మీటర్ల పొడువు ఉంటుంది. ఈ వంతెన దిగువున ఓడల రాకపోకలకు వీలుగా కిలకమైన వర్టికల్ లిప్ట్ ఉంటుంది. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం పూర్తయ్యేందుకు నాలుగేళ్లు పట్టింది. ప్రధాని మోడీ పంబన్ వంతెనను జాతికి అంకితం చేశారు.
అనంతరం రామేశ్వరం-తాంబరం ప్రత్యేక రైలును కూడా మోడీ ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలు పంబన్ వంతెన మీదుగా పరుగులు తీసింది. అదేవిధంగా వంతెన కింద ప్రయాణించిన కోస్ట్‌గార్డ్ నౌకకూ మోడీ పచ్చజెండా ఊపారు.