దేశవ్యాప్తంగా ఒకేసారి 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా తొమ్మిది రైళ్లను ప్రధానమంత్రి మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 25 రైళ్లతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 34 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. కొత్తగా ప్రారంభించిన సర్వీసులలో కాచిగూడ- యశ్వంత్‌పూర్, విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే రోజు ఎంతో దూరంలోలేదన్నారు. సరికొత్త భారత్ విజయాలను చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని ప్రధాని అన్నారు.