16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ సమావేశం
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రష్యా పర్యటనలో ఉన్నారు. మోడీ రష్యా పర్యటన ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఐదు దేశాలతో ఏర్పాడిన ఈ బ్రిక్స్ కూటమి.. ఇపుడు విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌది అరేబియా, యుఎఇలకు సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత ఇదే మొదటి సదస్సు. బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం ఈ సదస్సు ప్రధాన నినాదం.
రష్యాకు చేరుకున్నా ప్రధాని మోడీ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నానని, రష్యాతో భారతదేశానికి చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొత్త భారత రాయబార కార్యాలయాన్ని ప్రాంభిచడం వల్ల ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని మోడీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.