అంధ‌కారం తొల‌గిపోయే స‌మ‌యం ఆస‌న్నమైంది.. ప్ర‌ధాని మోడీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ హైద‌రాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్ర‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ధానికి స్వాగ‌త స‌భ ఏర్పాటు చేశారు. ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. తెలంగాణలో క‌మ‌ల వికాసం ఖాయ‌మ‌ని స్ప‌స్టం చేశారు. పేద‌ల‌ను దోచుకునే వారిని వ‌దిలేది లేద‌ని.. రాష్ట్రంలో నెల‌కొన్న అంధ‌కారం తొల‌గిపోయే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వం కుటుంబం ఫ‌స్ట్ నెక్ట్స్ అనే త‌ర‌హా పాల‌న న‌డుస్తోంద‌ని.. క‌మ‌ల వికాసంతో సూర్యోదయం వ‌స్తోంద‌న్నారు.

తెలంగాణ బిజెపి కార్య‌క‌ర్త‌లు బ‌ల‌మైన శ‌క్తుల‌ని.. వారు ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌రన్నారు. బిజెపిని, న‌న్ను ఎన్ని తిట్టినా.. స‌హిస్తాను కానీ.. ప్ర‌జ‌ల‌ను తిడితే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. త‌న మొద‌టి ప్రాధాన్యంత ప్ర‌జ‌ల‌కే కీనీ.. కుటుంబానికి కాద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. అరంత‌రం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల గురించి ప్రజ‌ల‌కు వివ‌రించాల‌ని బిజెపి కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి ప‌థ‌కాలు అంద‌రికీ అందేలా చూడాల‌ని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.