పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత లేరు.. ప్రధాని మోడీ

అమరావతి (CLiC2NEWS): అమరావతి పునఃనిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశానన్నారు. అమరావతి ఒక నగరం కాదని.. ఒక శక్తి అని మోడీ అన్నారు. వికసిత్ భారత్‌కు ఎపి గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టి.. ‘దుర్గా భవానీ కొలువైన ఈ పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు’. తాను గుజరాత్ సిఎం అయిన తర్వాత హైదరాబాద్‌లో ఐటి ని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నానన్నారు. ఆధికారుల్ని పంపించి హైదరాబాద్ ఐటి అభివృద్ధి గురించి అధ్యయనం చేయించారని తెలిపారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలన్నా.. అవి త్వరగా పూర్తి చేయాలన్నా అది చంద్రబాబుకే సాధ్యమని ఈ సందర్బంగా ప్రశంసించారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందన్నారు. ఇక్కడ దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేశానన్నాఉ. ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కాదని.. ఎపి ప్రగతి, ఆశలు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాదులని మోడీ అన్నారు. ఎన్‌టిఆర్ వికసిత్ ఎపి కోసం కలలు గన్నారని..మనమందరం కలిసి ఆయన కలల్ని నిజం చేయాలన్నారు. వికసిత్ భారత్ కోసం ఎపి గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలని.. పవన్ కల్యాణ్ గారు ఇది మనం చేయలని అన్నారు. వీరభద్రస్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వేంకటేశ్వర స్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఎపి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.