వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/vandeBharath-Modi.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండగ పూట తొలి సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్టణం మీదుగా నడిచే ఈ రైలు ప్రధాని మోడీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీనుంచి వర్చువల్‌గాప్రధాని ప్రారంభించారు. ఇది దేశంలో ఎనిమిదో వందే భారత్ రైలు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్రం వందేభారత్ రైళ్లను ఏడింటిని ప్రవేశపెట్టింది. కాగా దక్షిణ మద్య రైల్వే లో పట్టాలెక్కిన తొలి హైస్పీడో రైలుగా వందేభారత్ చరిత్రలో నిలిచింది.
కాగా సికింద్రాబాద్ లోని 10వ నెంబర్ ఫ్లాట్‌ఫారంపై జరిగిన ఈ వేడుకలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషర్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా ఈ రైలు ఆదివారం మినహా మిగతా రోజులులో సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య నడవనుంది. వరంగల్ ఖమ్మం, విజయవాడ,రాజమండ్రిస్టేషన్లలో ఈ ట్రైన్ ఆగనుంది.