ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోడీకి మాతృ వియోగం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ధాని న‌రేంద్ర మోడి త‌ల్లి హీరాబెన్‌ అనారోగ్యం కార‌ణంగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవ‌ల ఆమె అనారోగ్యానికి గురికావ‌డంతో అహ్మ‌దాబాద్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న స‌మ‌యంలో ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆమె క‌న్నుమూశారు. ప్ర‌ధాని మోడీ ఈ రోజు కార్య‌క్రమాల‌న్నిటినీ ర‌ద్దు చేసుకుని ఢిల్లీ నుండి అహ్మ‌దాబాద్ బ‌య‌ల్దేరి వెళ్లారు.

త‌ల్లి అంతిమ యాత్ర‌లో మోడీ పాల్గొన్నారు. మాతృమూర్తి పాడెను మోసి, వాహ‌నంలో పార్థివ‌దేహం వ‌ద్ద కూర్చున్న మోడీ భావోద్వేగానికి గుర‌య్యారు. గాంధీన‌గ‌ర్‌లోని శ్మ‌వానవాటిక‌లో అంత్య‌క్రియ‌లు పూర్తిచేశారు.

Leave A Reply

Your email address will not be published.