పాలమూరు రాష్ట్రంలో పసుపు బోర్డు.. గిరిజన వర్సిటి ప్రధాని మోడీ
![](https://clic2news.com/wp-content/uploads/2022/10/narendra-modi.jpg)
మహబూబ్ నగర్ (CLiC2NEWS): పాలమూరు వేదికగా శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని భారతీయ జనతాపార్టీ పూరించింది. పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మహబూబ్నగర్లో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్దతిలో ప్రారంభోత్సవం, శంకస్థాపనలు చేశారు. ప్రజాగర్జన సభలో ప్రధాని మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలు తర్వార రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ ఈరోజు రూ. 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. ఇక్కడి ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే.. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటుందని, అవినీతి రహిత ప్రభుత్వం కోరుకుంటున్నారని స్పష్టమవుతుందన్నారు.
కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని.. పసుపుపై పరిశోధనలు పెరిగాయని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మూంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ములుగు జిల్లాలో రూ. 900 కోట్లతో సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటి పేరుతో యూనివర్సిటి ఏర్పాటు చేస్తామన్నారు.